‘జూనియర్’ కోసం ‘సీనియర్’ బాబు..ఛాన్స్ ఉందా?

-

ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో అప్పటినుంచి పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలనే డిమాండ్ పలువురు టీడీపీ కార్యకర్తలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే మొదట్లో చంద్రబాబు, లోకేష్ సభలో కొందరు అభిమానులు ఎన్టీఆర్ జెండాలతో హల్చల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి కుప్పంలో కూడా కార్యకర్తలు ఎన్టీఆర్ రావాలని డిమాండ్ చేశారు.  అయితే ఇదంతా కొన్ని రోజులే జరిగింది…కానీ తర్వాత చంద్రబాబు, లోకేష్ లు దూకుడుగా పనిచేయడం…మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తూ రావడంతో..ఎన్టీఆర్ పేరు ఎక్కువ వినపడలేదు.

అయితే నెక్స్ట్ చంద్రబాబు అధికారంలోకి రావడానికి..తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునే దిశగా వెళుతున్నారు. ఇప్పటికే పవన్ తో కలిసి పోటీ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే…వీలు కుదిరితే బీజేపీకి దగ్గర అవ్వాలని కూడా చూస్తున్నారు. ఇలా ఏ అవకాశాన్ని చంద్రబాబు వదులుకోవడం లేదు. అదే సమయంలో నందమూరి ఫ్యామిలీ మళ్ళీ దగ్గర చేసుకోవడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య ఎలాగో పార్టీలోనే ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గర చేసుకుంటే ఇంకాస్త ప్లస్ అవుతుందని చంద్రబాబు చూస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించడం గాని, లేదంటే కనీసం ఎన్టీఆర్ మద్ధతు ఉన్నట్లు ఓ ప్రకటన అయిన వచ్చేలా చేసుకోవాలని బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఓపెన్ గా మాట్లాడి…బాబుకు మద్ధతు ప్రకటిస్తే…టీడీపీపై కోపంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు..మళ్ళీ పార్టీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు బాబు చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

అయితే ఈ కథనాల్లో నిజమెంత ఉందో ఎవరికీ క్లారిటీ లేదు…అసలు బాబు…మళ్ళీ ఎన్టీఆర్ ని కలిసే ప్రయత్నం చేస్తారా? కలిసిన ఎన్టీఆర్ మళ్ళీ ప్రచారం చేయడానికి ఒప్పుకుంటారా? లేదా మద్ధతు ప్రకటిస్తారా? అనేది ఊహాజనితమే. కానీ ఎన్నికల సమయంలో ఏదైనా జరగొచ్చు…కాబట్టి బాబు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news