బాబుకు తమ్ముళ్ళ షాక్.. అప్పటివరకు కష్టమేనట!

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీవ్ర కష్టాల్లో ఉంది..గత ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి పార్టీ బయటపడటం లేదు. ఏదొకవిధంగా పార్టీని బయటపడేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబుకు తమ్ముళ్ళ నుంచి అనుకున్న మేర మద్ధతు రావడం లేదు. దీంతో రెండున్నర ఏళ్ళు అయినా సరే పార్టీ పికప్ అవడం లేదు. స్థానిక ఎన్నికల్లో పార్టీ పూర్తిగా చేతులెత్తేసింది. ఉపఎన్నికల్లో అడ్రెస్ ఉండటం లేదు. ఈ పరిణామాలతో టీడీపీ రాజకీయంగా చాలా వెనుకబడిపోయింది.

 

chandrababu naidu

అసలు దరిద్రమైన విషయం ఏంటంటే…ఇంతవరకు ఏపీలో ప్రతిపక్ష పార్టీలు స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి…కనీసం ఒక్క సీటు అయిన గెలుచుకునేవి. కానీ ఇప్పుడు టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కని పరిస్తితి. తాజాగా 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ 11 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. టీడీపీ పోటీ చేసినా సరే ఒక్క సీటు కూడా దక్కదు.

అటు టీడీపీ నేతలు ఏదైనా సీటు దక్కించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేసేలా లేరు. ఎలాగో స్థానిక ఎన్నికల్లో బాబుకు షాక్ ఇస్తూ టీడీపీని గెలిపించలేకపోయారు…ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా అదే పరిస్తితి..పైగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి ఇంకా దారుణంగానే ఉంది. అసలు పార్టీని పైకి లేపే ప్రయత్నాలు టీడీపీ నేతలు చేయడం లేదు. 175 నియోజకవర్గాలు ఉంటే కనీసం 100 నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు మొక్కుబడిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే ఇప్పుడే బాగా హడావిడిగా పనిచేస్తే..ఆర్ధికంగా ఎక్కువగా ఇబ్బందులు పడాలని తమ్ముళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. ఇప్పుడే పార్టీ కోసం ఖర్చు పెడితే, నెక్స్ట్ ఎన్నికల్లో ఆర్ధికంగా ఇబ్బందులు పడాలని అనుకుంటున్నారు. ఎలాగో పార్టీ నుంచి కూడా పెద్దగా ఫండ్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు సైలెంట్‌గా ఉండి…నెక్స్ట్ ఎన్నికల ముందు చూసుకోవచ్చులే అని తమ్ములు భావిస్తున్నారట. అప్పటివరకు ఇంతే అంటున్నారు.