క్లౌడ్ బరస్ట్..పోలవరం…కమలం క్లారిటీ!

-

రాజకీయంగా అన్నివైపులా ఇరుక్కుపోయినప్పుడు…కొత్త వివాదాలు తెరపైకి తీసుకొస్తే…ఎంతోకొంత ప్లస్ అవుతుందనేది నేతల ఆలోచన. తమపై ఏదైనా వ్యతిరేకత వస్తే…దాన్ని కవర్ చేసుకోవడానికి కొత్త వివాదాన్ని సృష్టిస్తారు…అలాగే తమపై ఉన్న యాంటీని డైవర్ట్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ సైతం అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది…వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ పై ప్రజల్లో అంత సానుకూలత లేదు…పైగా విపక్షాలు బలపడుతున్నాయి…ఓ వైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ పార్టీలు పుంజుకుంటున్నాయి.

అలాగే కేసీఆర్ సర్కార్ పై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుంది..ఈ నేపథ్యంలో వ్యతిరేకతని పోగొట్టుకోవడానికి కేసీఆర్…ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. ఇదే క్రమంలో ఎప్పటిలాగానే తనకు కలిసొచ్చిన సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తీసుకురావడం…అలాగే సరికొత్త వివాదాలని సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల గోదావరి వరదల వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ముంపుకు గురైన విషయం తెలిసిందే..అలాగే గోదావరి పరీవాహక ప్రాంతాలు జలమయ్యాయి.

అయితే ఇలా వరదల వల్ల నష్టపోయిన ప్రజలని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది…ఇక ఆ పని సరిగ్గా చేస్తున్నారో లేదో తెలియదు గాని..ఉన్న సమస్యలని డైవర్ట్ చేయడానికి క్లౌడ్ బరస్ట్ అనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు…భారీ వరదలకు విదేశీ కుట్ర ఉందని, క్లౌడ్ బరస్ట్ జరిగిందనే అనుమానం ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ వ్యాఖ్యలకు అందరూ నవ్వుకునే పరిస్తితి..అలాగే ఆయన వింత వ్యాఖ్యలని జనం కూడా నమ్మలేదు.

ఈ క్రమంలోనే మరో సారి సెంటిమెంట్ అస్త్రం లేపారు…ఏపీలో కడుతున్న పోలవరం ఎత్తు పెంచడం వల్లే గోదావరి వరద ఎదురుతన్ని భద్రాచలం ముంపుకు గురైందని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త రాగం అందుకున్నారు. అటు ఏపీ మంత్రులు దీనికి కౌంటర్ ఇస్తున్నారు. అలాగే ఏపీలో విలీనం చేసిన ముంపు మండలాలని మళ్ళీ తెలంగాణలో కలపాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు…అలా అయితే హైదరాబాద్ ఆదాయంలో వాటా కావాలని, భద్రాచలంని ఏపీలో కలపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.

ఇలా మాటల యుద్ధం చేస్తూ…రాజకీయంగా లబ్ది పొందాలనేది కేసీఆర్ సర్కార్ ఆలోచన…కానీ ప్రజలు దీన్ని నమ్మే పరిస్తితుల్లో లేరు. అలాగే దీని ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనే కేసీఆర్ ప్లాన్ కూడా పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది…పోలవరం కోసమే ముంపు మండలాలని ఏపీలో కలిపారని, మళ్ళీ కేసీఆర్ రాజకీయ లబ్ది కోసం…తెలంగాణలో కలిపే ప్రసక్తి లేదని చెబుతుంది. ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని తెలంగాణ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా కేసీఆర్ ప్లాన్ పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news