కేసీఆర్ ‘ఫ్రంట్’ పాలిటిక్స్.. అంతా కాంగ్రెస్ వైపే…!

-

కేసీఆర్ ఫ్రంట్ పాలిటిక్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యేలా ఉన్నాయి..ఆయన అనుకున్న విధంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటయ్యే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది…గత కొంతకాలం నుంచి కేసీఆర్…బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే…రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా కేసీఆర్ ముందడుగు వేశారు…ఇదే క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారు..అసలు బీజేపీ వల్ల దేశం నాశనమైపోతుందని, వెంటనే దేశాన్ని మార్చేయాలని హడావిడి చేయడం మొదలుపెట్టారు.

అలాగే బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని చెప్పి..ఇతర రాష్ట్రాలు తిరుగుతూ, జాతీయ నేతలని వరుసపెట్టి కలుస్తున్నారు..ఇప్పటికే మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, దేవెగౌడ లాంటి నేతలని కలిశారు..తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌తో భేటీ అయ్యారు. ఇంకా పలువురు నాయకులని కలవడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కానీ ఎంతమందిని కలిసిన కేసీఆర్ ఫ్రంట్ పాలిటిక్స్ మాత్రం వర్కౌట్ అయ్యేలా లేవు..ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ కలిసిన వారందరూ..కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవారే.

వారు కేసీఆర్‌కు ఒకే మాట చెబుతున్నట్లు తెలుస్తోంది..కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి కట్టడం వల్ల ప్రయోజనం లేదని తేల్చి చెప్పేస్తున్నారట. తాజాగా హేమంత్ సొరేన్ దగ్గర నుంచి అదే సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఏ ఫ్రంట్ కట్టడం లేదని చెప్పారని తెలుస్తోంది. ఇప్పటికైతే ఏ ఫ్రంట్ లేదని, ఏదైనా ఉంటే చెబుతామని అన్నారు.

అంటే ఏ నాయకుడు దగ్గర నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది..అందుకే కేసీఆర్ ఏ ఫ్రంట్ లేదని చెప్పారు. అయితే భవిష్యత్‌లో ఏదైనా ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న…కాంగ్రెస్ లేకుండా చేయడం కష్టమని చెప్పొచ్చు. తప్పనిసరిగా కాంగ్రెస్ ఉంటేనే బీజేపీని ఎదురుకోవచ్చనేది చాలామంది నేతల అభిప్రాయం. మరి చూడాలి కేసీఆర్ ఫ్రంట్ ఏం అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news