నల్గొండపై హస్తం పట్టు..కారు గ్రాఫ్ డౌన్?

-

నల్గొండ పార్లమెంట్..మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోట..ఇక్కడ అనేకసార్లు కాంగ్రెస్ జెండా ఎగిరింది. మధ్య మధ్యలో కమ్యూనిస్ట్ పార్టీ అయినా సి‌పి‌ఐ కూడా సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. 1984లో టి‌డి‌పి గెలవగా, 1989లో కాంగ్రెస్ గెలిచింది..ఆ తర్వాత సి‌పి‌ఐ గెలిచింది. మళ్ళీ 1999లో టి‌డి‌పి గెలిచింది. 2004లో సి‌పి‌ఐ గెలిచింది. ఇక ఇక్కడ బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇంతవరకు గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది.

గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అలా నల్గొండపై కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో బి‌ఆర్‌ఎస్ పట్టు సాధించింది. పార్లమెంట్ పరిధిలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యపేట, నల్గొండ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్క హుజూర్ నగర్ లోనే కాంగ్రెస్ గెలిచింది. మిగిలిన స్థానాలు బి‌ఆర్‌ఎస్ గెలుచుకుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ మారింది.

సూర్యాపేట, నల్గొండ స్థానాల్లోనే బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం రాగా, మిగిలిన ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. ఇప్పుడు అక్కడ పరిస్తితులు చూస్తే కాంగ్రెస్ పార్టీనే లీడ్ లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. హుజూర్ నగర్, కోదాడ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకే ఆధిక్యం కనిపిస్తుంది.

అటు దేవరకొండలో పోటాపోటి ఉంది. ఇక సూర్యాపేటలో కాస్త బి‌ఆర్‌ఎస్ పార్టీకి లీడ్ కనిపిస్తుంది. ఇక నల్గొండ అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని బరిలో దిగితే బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారు. ఏదేమైనా నల్గొండలో మాత్రం ఈ సారి హస్తం పార్టీకే ఆధిక్యం వచ్చేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news