తెలంగాణలో అధికారం సాధించే దిశగా బీజేపీ వడివడిగా అడుగులేస్తుంది…బీజేపీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తూ…తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే బీజేపీలో నేతలంతా దూకుడుగానే పనిచేస్తున్నారు…తమదైన శైలిలో రాజకీయం చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడమే దిశగా పనిచేస్తున్నారు. ఇక బీజేపీలో దూకుడుగా పనిచేసే నేతలు ఉన్నట్లే..సైలెంట్ గా పనిచేస్తూ తెరవెనుక పార్టీ బలోపేతం కోసం కృషి చేసే నేతలు కూడా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే క్రియేటివ్ పాలిటిక్స్ తో వారు ముందుకెళుతున్నారు.
తెరవెనుక ఉండి కథ అంతా నడిపిస్తున్నారు…అలా తెరవెనుక ఉండి పార్టీని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేతల్లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ముందువరుసలో ఉంటారని చెప్పొచ్చు. తెలంగాణ రాజకీయాల్లో వివేక్ గురించి పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. అనేక ఏళ్ళు నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడుగా పనిచేస్తూ వస్తున్న వివేక్…ఇప్పుడు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తున్నారు.
అలాగే ఈటల రాజేందర్ లాంటి బడా నేతని బీజేపీలోకి తీసుకురావడంలో, హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిపించడంలో వివేక్ పాత్ర ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఆర్ధికంగా, రాజకీయంగా వివేక్..ఈటలకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు వివేక్…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్..బీజేపీలో చేరడం ఖాయమైంది…అలాగే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి…దీంతో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చే ఛాన్స్ ఉండి.
ఆ ఉపఎన్నికలో కోమటిరెడ్డి గెలుపు కోసం ఇప్పటినుంచే వివేక్ పనిచేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది…తన సొంత మీడియా ద్వారా…మునుగోడులో సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది..అలాగే కోమటిరెడ్డి గెలుపుకు సంబంధించి కీలక వ్యూహాలు కూడా పన్నుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వివేక్…కోమటిరెడ్డికి ఆర్ధికంగా కూడా అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి…మొత్తానికైతే కోమటిరెడ్డి కోసం తెరవెనుక ఉండి వివేక్ గట్టిగానే కష్టపడుతున్నారు.