గద్వాల్ కోటలో డీకే అరుణ పాగా వేస్తారా?

-

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా..గద్వాల్ నియోజకవర్గం డీకే ఫ్యామిలీ కంచుకోట. నియోజకవర్గం ఏర్పడిన 1957 నుంచి గద్వాల్‌లో డి‌కే ఫ్యామిలీ హవా కొనసాగుతూ వస్తుంది. 1957లో ఇండిపెండెంట్ గా డి‌కే సత్యారెడ్డి గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి గెలిచారు. 1980లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇక డి‌కే సమరసింహారెడ్డి 1983, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1994లో డి‌కే భరతసింహారెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచారు.

ఇక 2004లో డి‌కే అరుణ ఇండిపెండెంట్ గా గద్వాల్‌లో సత్తా చాటారు. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే స్వయానా తన మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలోనే డి‌కే అరుణ ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయిన తర్వాత అరుణ..కాంగ్రెస్ పార్టీని వదిలి బి‌జే‌పిలో చేరారు. ఇప్పుడు బి‌జే‌పిలో కీలక నాయకురాలుగా పనిచేస్తున్నారు.

 

వచ్చే ఎన్నికల్లో గద్వాల్ బరిలో మళ్ళీ సత్తా చాటాలని అరుణ పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం గద్వాలలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయి? అరుణకు అనుకూలమైన వాతావరణం ఉందా? అనే విషయాలని చూస్తే..ప్రస్తుతానికి బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న బండ్లకు పూర్తి అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కే‌సి‌ఆర్ గాలిలో గెలిచేశారు. ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు.

ఇక్కడ బి‌జే‌పికి బలం తక్కువే..కానీ డి‌కే అరుణ ఇమేజ్ మీదే గద్వాల్ లో రాజకీయం నడుస్తుంది. అయితే గద్వాల్ లో కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం ఉంది. ఆ పార్టీ గాని ఎక్కువ ఓట్లు చీలిస్తే అరుణ గెలుపు పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే అరుణ గెలుపు అంత ఈజీ కాదు..కానీ కాస్త గట్టిగా కష్టపడి పనిచేస్తే గద్వాల్ కోటలో అరుణ మళ్ళీ పాగా వేయగలరు.

Read more RELATED
Recommended to you

Latest news