టీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉందంటే చాలు, ఆ కష్టాలని తొలగించడంలో హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు. కేసీఆర్ పైన ఉండి పార్టీని నడిపిస్తున్నా…కింది స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకురావడంలో హరీష్ రావు పాత్ర ఏంటో ఉందని చెప్పొచ్చు. కేటీఆర్, సంతోష్‌లు రాకముందు నుంచి హరీష్, టీఆర్ఎస్ని ఏ స్థాయిలో పైకి తీసుకురావడానికి కృషి చేశారో అందరికీ తెలిసిందే.
అసలు ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం హరీష్, తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులని చిత్తు చేయడానికి చూస్తారు. అలాగే పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నా, పార్టీకి గెలుపు అవకాశాలు తక్కువ ఉన్న నియోజకవర్గాలల్లో ఎంట్రీ ఇచ్చి హరీష్ మొత్తం సెట్ చేసేస్తారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో హరీష్‌కు ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది. అయితే ఆ ట్రబుల్ షూటర్ అనే పేరుని దెబ్బకొట్టడానికి కేసీఆర్ ప్లాన్ చేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఈ విషయాన్నే చెబుతున్నారు.
అందులో భాగంగానే హుజూరాబాద్‌లో గెలుపు బాధ్యతని హరీష్ భుజంపై పెట్టారని అంటున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో కూడా టీఆర్ఎస్ గెలుపు బాధ్యతని హరీష్ రావే తీసుకున్నారు. ఆయన రంగంలోకి దిగితే పార్టీ గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పార్టీ ఓడిపోయింది. అక్కడ నుంచి ట్రబుల్ షూటర్ పని అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఓడిపోయే హుజూరాబాద్ బాధ్యతలు అప్పగించి హరీష్‌ని ఇంకా దెబ్బకొట్టాలని కేసీఆర్ చూస్తున్నారని, అప్పుడు కేటీఆర్‌కు లైన్ క్లియర్ చేసుకోవాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. అంటే హరీష్‌కు స్టామినా లేదనే నిరూపించి, కేటీఆర్‌ని హైలైట్ చేయాలని కేసీఆర్ ప్లాన్ అని అంటున్నారు.