పవన్‌కు నాదెండ్ల క్లారిటీ.. బాబు వైపే..?

నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి..ఏ పార్టీతో కలిసి వెళితే ప్రయోజనం ఉంటుందనే అంశాలపై పవన్ కల్యాణ్ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ కన్ఫ్యూజన్ కూడా పవన్..మోదీతో భేటీ అయిన తర్వాతే అని తెలుస్తోంది. ఎట్టి పరిస్తితుల్లోనూ చంద్రబాబుతో కలవకూడదని మోదీ..పవన్‌తో చెప్పినట్లు తెలిసింది. బాబుతో కలిస్తే ఇంకా రాజకీయంగా ఎదగనివ్వరు అని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత నుంచి పొత్తులపై క్లారిటీ లేదు.

అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలన్న..కొన్ని సీట్లు గెలుచుకుని అధికారంలో ఉండాలన్న టీడీపీతో కలవడం ముఖ్యమని..జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్‌తో పాటు కొందరు సీనియర్లు పవన్‌కు సూచిస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే మళ్ళీ సింగిల్ గా పోటీ చేసినా, లేదా బీజేపీతో కలిసి పోటీ చేసినా ఓట్లు చీలిపోయి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, మళ్ళీ జగన్‌ని సీఎం చేయడానికే టీడీపీకి దూరంగా ఉండాలని బీజేపీ సూచిస్తున్నట్లు జనసేన నేతలు భావిస్తున్నారు.

బీజేపీతో పొత్తు వల్ల పావలా ప్రయోజనం ఉండదని..ఆ పార్టీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదని, ఇక తమ బలం చూసుకుంటే పది శాతం వరకు ఉంటుందని, దాంతో 10 సీట్లు తెచ్చుకోవచ్చు అని, కానీ అధికారంలోకి రావడం జరిగే పని కాదని జనసేన నేతలు అనుకుంటున్నట్లు తెలిసింది. అందుకే పవన్ కన్ఫ్యూజన్ లేకుండా..టీడీపీతో కలిసి వెళితే బెటర్ అని, అప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని, టీడీపీతో కలిసి అధికారం కూడా పంచుకునే ఛాన్స్ వస్తుందని అంటున్నారట.

వాస్తవానికి జనసేనలో ఇదే చర్చ నడుస్తున్నట్లు సమాచారం..అయితే వచ్చే ఎన్నికల్లో జనసేనకు సింగిల్‌గా గాని, బీజేపీతో కలిసి పోటీ చేసిన గాని..అధికారం రాదు..10 సీట్లు గెలుచుకున్న గొప్పే. అలా కాకుండా టీడీపీతో కలిస్తే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు..అలాగే పవన్ అనుకున్న విధంగా జగన్‌ని గద్దె దించే ఛాన్స్ కూడా రావచ్చు. మరి ఈ పొత్తుల అంశంపై పవన్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.