‘సీఎం’ పవన్ కష్టమే…అందుకే వాటిపై ఫోకస్?

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పవన్‌కు ఎంత క్రేజ్ ఉన్నా రాజకీయంగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. కానీ ఆయన అభిమానులు, కార్యకర్తలు మాత్రం మా నాయకుడు సి‌ఎం అవుతారని గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందుకే పవన్ ఎక్కడకు వెళ్ళినా సరే సి‌ఎం సి‌ఎం అంటూ అభిమానులు హడావిడి చేస్తారు. ఇక వారి హడావిడికి తగ్గట్టుగానే పవన్ సి‌ఎం అయ్యే ఛాన్స్ వెనక్కి వెళ్లిపోతుంది.

2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్…ఆ ఎన్నికల్లో ఏపీలో టి‌డి‌పి-బి‌జే‌పిలకు మద్ధతు ఇచ్చారు. ఇక వారు అధికారంలో రావడానికి సాయపడ్డారు. ఇక 2019 ఎన్నికల్లో తొలిసారి పవన్ ఎన్నికల బరిలో దిగారు. కమ్యూనిస్టులు, బి‌ఎస్‌పి పార్టీలతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయి ఘోరంగా విఫలమయ్యారు. కేవలం జనసేనకు ఒకే ఒక సీటు వచ్చింది. పవన్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.

దీంతో పవన్ కల్యాణ్ బలం ఏంటో అందరికీ అర్ధమైపోయింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయాక జనసేన పికప్ కాలేకపోతుంది. బి‌జే‌పితో పొత్తు పెట్టుకున్నా సరే పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిస్తితిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన గెలవడం గానీ, పవన్ కల్యాణ్ సి‌ఎం అవ్వడం గానీ జరిగే పని కాదని అర్ధమైపోతుంది. ఆ విషయం పవన్‌కు కూడా అర్ధమైనట్లు ఉంది.

అందుకే ఆయన కూడా తన రాజకీయాన్ని మారుస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకేసారి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలపై ఫోకస్ చేయకుండా, తాము బాగా బలంగా ఉన్న స్థానాలపై పవన్ ఫోకస్ చేశారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాస్త మంచి ఓట్లు పడ్డ కృష్ణా, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కనీసం ఈ జిల్లాల్లో ఒక 30 సీట్లు అయినా గెలిస్తే, ఏపీ రాజకీయాలని ప్రభావితం చేయొచ్చని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు టి‌డి‌పి-వైసీపీలు పోటాపోటిగా సీట్లు తెచ్చుకుని హాంగ్ వస్తే తాను కీలకంగా మారవచ్చని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన ఏ మేర ప్రభావం చూపుతుందో?