అవకాశం దొరికితే చాలు అధికార వైసీపీని ఆడేసుకోవాలని ప్రతిపక్ష టీడీపీ ఎప్పుడు చూస్తూ ఉంటుంది. తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా వైసీపీకి చెక్ పెట్టేందుకు చూస్తూ ఉంటుంది. ఇదే జగన్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలని కూడా టీడీపీ వాడుకోవాలని చూసింది…కానీ వైసీపీ తెలివిగా టీడీపీకి చెక్ పెట్టేసిందని చెప్పొచ్చు. అసలు టీడీపీ ఏ అంశాన్ని వాడుకోవాలని అనుకుంది…వైసీపీ ఎలా చెక్ పెట్టింది? అనేది ఒక్కసారి చూస్తే…కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి జగన్…వైసీపీ పెట్టినప్పుడు..జగన్ కు…తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ అండగా నిలబడ్డారు.
అదిగో వారిని జగన్ సైడ్ చేసేశారని టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. ఇదే క్రమంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో…టీడీపీ కొత్త కథనాలు అల్లుకుంటూ వచ్చింది..జగన్ తో పడకే షర్మిల తెలంగాణకు వెళ్లిపోయారని ప్రచారం చేశారు. అలాగే జగన్..తన తల్లి విజయమ్మని కూడా పార్టీ నుంచి సైడ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని, పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయించడానికి జగన్ సిద్ధమయ్యారని, ప్లీనరీ సమావేశాల కంటే ముందే టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే ఆమెని ప్లీనరీ సమావేశాలకు రానివ్వకుండానే రాజీనామా చేయిస్తారని చెప్పుకొచ్చింది. ఇదే జరిగితే వైసీపీని ఇంకా ఆడుకోవడానికి టీడీపీ సిద్ధమైంది. కానీ వైసీపీ ఇక్కడే టీడీపీకి చెక్ పెట్టింది. విజయమ్మ ప్లీనరీ సమావేశాలకు వచ్చారు…జగన్ పాలనని మెచ్చుకున్నారు..అలాగే టీడీపీకి కౌంటర్లు ఇచ్చారు. ఇక తాను షర్మిలకు అండగా ఉండటానికి…వైసీపీ నుంచి తప్పుకుంటానని చెప్పారు. రెండు పార్టీల్లో ఉండటం కరెక్ట్ కాదని భావించిన ఆమె…హుందాగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తన పయనం షర్మిలతో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇలా ప్లీనరీలోనే చెప్పడంతో..టీడీపీకి ఫ్యూజులు ఎగిరిపోయినట్లు అయింది…అలా కాకుండా విజయమ్మ సభకు రాకపోతే టీడీపీ రకరకాల ప్రచారాలు చేసేది…మొత్తానికి ప్లీనరీ ద్వారా టీడీపీకి వైసీపీ చెక్ పెట్టింది.