రేవంత్ వర్సెస్ బండి..బీఆర్ఎస్‌తో కలిసి ఉన్నది ఎవరు?

-

తెలంగాణలో మూడు పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే. బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి, కాంగ్రెస్ ల మధ్య పోరు జరుగుతుంది. అయితే ఇలా త్రిముఖ పోరు ఓట్ల చీలిక ఎక్కువ ఉంటుంది. అందుకే పార్టీలు ఏం చేస్తున్నాయంటే…ఒకరితో ఒకరు లింకులు పెట్టేలా రాజకీయం చేస్తున్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ…బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి ఒకటే అనే విమర్శలు చేస్తుంది. దాని ద్వారా ప్రజలు రెండు పార్టీలు ఒకటే అని నమ్మే పరిస్తితి ఉండదు.

ఇలా ఎవరికి వారు రాజకీయం చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ లో పాదయాత్ర చేస్తున్న టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి టార్గెట్ గా విరుచుకుపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని, ఉదయం కొట్టుకుంటారు.. సాయంత్రం కలుస్తారని అన్నారు. బి‌జే‌పికి ఓటు వేస్తే బి‌ఆర్‌ఎస్‌కు వేసినట్లే అని కామెంట్ చేశారు. ఇక దీనికి బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్సే కలిసి పోటీ చేయబోతున్నాయని,  కాంగ్రెస్‌కు ఓటేస్తే. బీఆర్ఎస్‌కు వేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారన్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేసింది ఎవరని ప్రశ్నించారు. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డే బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని అన్నారని, . హోల్ సేల్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరలేదా? అని బండి ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్‌ను ఢిల్లీలో, గల్లీలో ఎవరూ పట్టించుకోవడం లేదని,  బీజేపీ బలంగా ఉందని.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, దుబ్బాక, మునుగోడు, హుజురాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి ప్రజలు చూశారని అన్నారు. మొత్తానికి రేవంత్ ఏమో..బి‌జే‌పి-బి‌ఆర్‌ఎస్ ఒక్కటే అంటున్నారు..బండి ఏమో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ ఒక్కటే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news