అసలు ఏ మాత్రం బలం లేని మునుగోడులో గెలిచి తీరాలని చెప్పి బీజేపీ గట్టిగానే కష్టపడుతుంది. అదేంటి బలం లేని చోట ఎలా గెలుస్తారని అనుకోవచ్చు..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరక ముందు వరకు మునుగోడులో బలం లేదు…ఆయన వచ్చాక మునుగోడులో బీజేపీ బలం పెరిగింది..అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవారు కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీ వైపు చూడటం మొదలుపెట్టారు. దీంతో రాష్ట్ర స్థాయిలోనే కాదు…మునుగోడులో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి కలిసొస్తుంది.
ఇక దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగానే మునుగోడులో కూడా సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది. అయితే హుజూర్ నగర్, నాగార్జున సాగర్ మాదిరిగా…మునుగోడులో గెలవాలని, బీజేపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని అధికార టీఆర్ఎస్ చూస్తుంది. ఈ సారి ఎగలైగానే గెలవాలనే కసితో టీఆర్ఎస్ పనిచేస్తుంది. అయితే టీఆర్ఎస్‌కు ధీటుగానే బీజేపీ ముందుకెళుతుంది. ఇప్పటికే మునుగోడులో అమిత్ షా సభ తర్వాత బీజేపీకి కొత్త ఊపు వచ్చింది. అటు కోమటిరెడ్డి ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజల మద్ధతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక కేంద్రం పెద్దలు కూడా మునుగోడుపై ఫోకస్ పెట్టారు…ఇటు రాష్ట్ర నేతలు మునుగోడులో మకాం వేయనున్నారు. ఇక మునుగోడులో పార్టీని గెలిపించే బాధ్యత ఈ సారి జితేందర్ రెడ్డికి కాకుండా…తెరవెనుక సీక్రెట్‌గా పార్టీని బలోపేతం చేసే వివేక్‌కు అప్పగించనున్నారని తెలిసింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఇంచార్జ్‌గా జితేందర్ రెడ్డి పనిచేశారు.
కానీ ఇప్పుడు మునుగోడుకు వివేక్‌ని ఇంచార్జ్‌గా పెట్టనున్నారని తెలిసింది. అలాగే మునుగోడు బీజేపీ నేత గంగిడి మనోహర్ రెడ్డికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఎప్పుడు తెర వెనుక ఉంటూ తనదైన శైలిలో వ్యూహాలు పన్ని…బీజేపీ విజయాలకు కృషి చేస్తున్న వివేక్..ఈ సారి తెరముందుకు రానున్నారు. వివేక్ అన్నిరకాలుగా కోమటిరెడ్డికి అండగా నిలవనున్నారు.