షర్మిలమ్మ కూడా ఉన్నారు..’గుర్తించండి’!

-

ఎన్నో భారీ అంచనాల మధ్య తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిలకు రాజకీయంగా ఏది కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. అసలు తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్నారంటే..అంతా ఎక్కువ ఊహించుకున్నారు. ఆమె టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా వస్తారని అనుకున్నారు. వైఎస్సార్టీపీ తెలంగాణలో సత్తా చాటుతుందని, తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాగే క్రిస్టియన్, మైనారిటీ, రెడ్డి ఓట్లు ఆమెకు కలిసొస్తాయని విశ్లేషణలు వచ్చాయి. అలాగే ఆమె పార్టీలోకి వలసలు ఊహించని రీతిలో ఉంటాయని కథనాలు వచ్చాయి.

Sharmila
Sharmila

కానీ పార్టీ పెట్టిన నెల రోజుల్లోనే అంతా తారుమారైంది. తెలంగాణలో షర్మిలకు ఆదరణ లేదని అర్ధమైంది. ఆమెకు ప్రజల మద్ధతు లేదని తెలిసింది. అలాగే ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా షర్మిల పార్టీలోకి రాలేదు. అసలు తెలంగాణలో టీడీపీకి ఏ పరిస్తితి ఉందో…షర్మిల పార్టీకి కూడా అదే పరిస్తితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఒక వార్డు మెంబర్ గెలుచుకునే స్థాయి షర్మిల పార్టీకి రాలేదు.

అసలు ఆమె పార్టీ ఉన్నట్లు రాష్ట్రంలో చాలామందికి తెలియడం లేదు. కానీ గుర్తింపు కోసం షర్మిల గట్టిగానే ట్రై చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు…కేసీఆర్ ప్రభుత్వంపై రోజూ ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వ విధానాలని ఎండగడుతున్నారు. దీక్షలు పేరిట ప్రజల్లోకి వెళుతున్నారు. అయినా సరే షర్మిల పార్టీకి జనాల్లో గుర్తింపు రాలేదు.

జనాల్లోనే కాదు…ఎన్నికల సంఘం సైతం షర్మిల పార్టీని గుర్తించడం లేదు. ఇప్పటికే వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు షేక్ బాషా అనే వ్యక్తి..షర్మిల పార్టీకి గుర్తింపు ఇవ్వడంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మాత్రమే కాదు…ఇంకా పార్టీ విషయంలో చాలా లొసగులు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే షర్మిల పార్టీకి ఇంకా గుర్తింపు రావడం లేదని తెలుస్తోంది. మొత్తానికైతే షర్మిల పార్టీకి రాజకీయంగా గుర్తింపు లేదు..కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లేదు.

Read more RELATED
Recommended to you

Latest news