టీడీపీ-జనసేన పొత్తుతో అధికారం..సర్వే లెక్కలు ఇవే..!

-

ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఖాయమైందని చెప్పవచ్చు..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులో పోటీ చేయనున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే వైసీపీకి ఎంతో కొంత నష్టం మాత్రం తప్పదు. ఎందుకంటే అప్పుడు ఓట్ల చీలిక జరగదు. గత ఎన్నికల్లో ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. ఆ విషయం స్వయంగా పవన్ ఒప్పుకున్నారు. దాదాపు 53 స్థానాల్లో జనసేన ప్రభావం చూపిందని, దాని వల్ల టీడీపీ ఓడిపోవడం, వైసీపీ గెలవడం జరిగింది.

కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదు అని చెప్పి చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా ముందుకెళుతున్నారు. ఇక వీరితో బీజేపీ కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. టీడీపీతో కలవడానికి బీజీపీ ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. పవన్ మాత్రం టీడీపీతోనే కలిసి వెళ్లడానికి రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ-జనసేన పొత్తు ప్రభావంపై ఆల్రెడీ సర్వేలు జరుగుతున్నాయని తెలిసింది. అటు బీజేపీ సైతం పొత్తుపై సర్వే నిర్వహిస్తుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన పొత్తు ఎక్కువ ప్రభావం చూపే ఛాన్స్ ఉందని..దాదాపు 120 స్థానాల వరకు పొత్తులో గెలిచే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారట. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు లాంటి ఉమ్మడి జిల్లాల్లో పొత్తు ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఆ జిల్లాల్లో 80 సీట్లు ఈ రెండు పార్టీలు గెలుచుకుంటాయని అంచనా వేస్తున్నారు.

అటు టీడీపీ వర్గాల్లో పొత్తుతో 140 సీట్లు గెలుస్తామని అంచనా వేస్తున్నారు..అంటే వైసీపీకి 35 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే లెక్కలు చెబుతున్నారు. చూడాలి మరి చివరికి పొత్తు ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది.

Read more RELATED
Recommended to you

Latest news