అసలు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు…మళ్ళీ పోటీ చేసిన ఓడిపోతారు..అసలు పవన్‌కు ప్రజా మద్ధతు లేనే లేదని వైసీపీ నేతలు ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటారు. అదే సమయంలో పవన్..చంద్రబాబుతో కలవాలని చూస్తున్నారని, దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయన బస్సు యాత్ర చేయడానికి బస్సుని రెడీ చేసుకుంటే..దాని కలర్ అలా ఉంది..ఇలా ఉంది. మిలటరీ కలర్ అంటూ వంకలు పెడతారు.
అసలు ప్రజా బలం లేదు..రెండు చోట్ల ఓడిపోయాడని పదే పదే ఎగతాళి చేసే వైసీపీ నేతలకు..ఆయన ఎవరితో కలిస్తే వైసీపీకి ఎందుకు?175 సీట్లలో పోటీ చేస్తారో..అసలు పోటీ చేయారో వైసీపీకి ఎందుకు? ఆయన బస్సు యాత్ర చేస్తారానికి రెడీ అయితే వైసీపీలో టెన్షన్ ఎందుకు? ఆయన బస్ కలర్ ఏదైతే వైసీపీకి ఎందుకు? ఏమైనా అభ్యంతరాలు ఉంటే రవాణా శాఖ వారు చూసుకుంటారు కదా..మరి ఈలోపు వైసీపీ ఆతృత దేనికి అని చెప్పి జనసేన శ్రేణులు వైసీపీపై ఫైర్ అవుతున్నాయి.
అసలు ప్రభుత్వ బిల్డింగులకు వైసీపీ పార్టీ రంగులు వేసే వారు కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. అయితే ఆ బస్ పేరుపై కూడా వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వారాహి కాదు…నారాహి అని పేరు పెట్టుకోవాలని రోజా లాంటి వారు మాట్లాడుతున్నారు. అదేమంటే ఆ బస్ కలర్ మిలటరీ వాహనాలకే వేస్తారని, దమ్ముంటే 175 స్థానాల్లో పవన్ పోటీకి పెట్టాలని అంటున్నారు. బస్ కలర్ గురించి మాట్లాడే రోజా..పంచాయితీలకు, వాటర్ ట్యాంకులకు వైసీపీ రంగులు వేసినప్పుడు కూడా చెప్పి ఉంటే బాగుండేది.
ఇక ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది పవన్ ఇష్టం. అయినా పవన్ బాబుతో కలిసి వెళితే వైసీపీకి రిస్క్ అని అర్ధమవుతుంది..అందుకే పవన్‌కు భయపడే..ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా పైకి పవన్‌ని ఎగతాళి చేస్తున్నా సరే..లోలోపల పవన్ వల్ల ఇబ్బందే అని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.