తెలంగాణకు వివేకా కేసు..జగన్‌పై టీడీపీ ఫైర్..!

గత ఎన్నికల ముందు సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్ సునీతా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది.

ఆయువుపట్టులో ఎవరి బలం ఎంత? | ycp chief ys jagan and tdp chief chandrababu are working hard to win the next election

కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె, భార్యకు కేసు విచారణపై అసంతృప్తి ఉన్నందున బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు సుప్రీం తెలిపింది. అలాగే ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే ఎన్నికల ముందు వివేకా హత్య జరిగిన విషయం తెలిసిందే..ఈ హత్య చేసింది టీడీపీ నేతలే అని జగన్‌తో సహ వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అలాగే సి‌బి‌ఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు.

అయితే జగన్ అధికారంలోకి వచ్చాక కథ మొత్తం మారిపోయింది..ఇప్పటికే పలువురుని హత్య కేసులో అరెస్ట్ చేశారు. అలాగే అధికారంలోకి వచ్చాక సి‌బి‌ఐ విచారణ కావాలని వేసిన పిటిషన్‌ని జగన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో సునీతా సి‌బి‌ఐ విచారణ కావాలని పిటిషన్ వేశారు. దీంతో సి‌బి‌ఐ విచారణకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ కడప సి‌బి‌ఐ కోర్టు ద్వారా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొందరు బెదిరింపులకు పాల్పడుతూ సాక్ష్యాధారాలని తారుమారు చేయడానికి చూస్తున్నారని చెప్పి సునీతా..ఈ కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కేసుని తెలంగాణలోని సి‌బి‌ఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ అంశంపై చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీతో జగన్మోహన్ రెడ్డి తలెక్కడ పెట్టుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి. అబ్బాయే బాబాయ్‌ను చంపాడు’’ అని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు కూడా వివేకా కేసు విషయంలో జగన్‌పై విరుచుకుపడుతున్నారు. సొంత చెల్లికే అన్యాయం చేస్తున్నారని, నిందితులని కాపాడుతున్నారని ఫైర్ అవుతున్నారు.