నాడు టీడీపీ చేసిన పొరపాట్లే చేస్తున్న వైసీపీ..

-

ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్న పార్టీగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. ఈ విషయాల్లో ఏ మాత్రం తేడాలు వచ్చినా తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనమే ప్రస్తుత టీడీపీ పరిస్థితి. ఆ పార్టీ చేసిన తప్పులే చివరకు అధికారాన్ని దూరం చేశాయని చెప్పొచ్చు. కాగా ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఇలాంటి పొరపాట్లే చేసప్తోంది. రీసెంట్ గా టీడీపీ శాసన సభాపక్ష ఉప నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, అలాగే నిమ్మల్ రామానాయుడి విషయంలో ఓ ఘటన చోటుచేసుకుంది.

ycp-tdp
ycp-tdp

అదేంటంటే ఈ ఇద్దరికీ కూడా వచ్చే శాసనసభలో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హక్కుల సంఘం తీర్మాణం చేయడం పెద్ద సంచలనం రేపుతోంది. రాబోయే రెండున్నరేళ్ల పాటు వీరిద్దరికీ అవకాశం ఇవ్వకుండా ఉంచేందుకు సిఫార్సు చేసింది. దీన్ని బట్టి అర్థం అవుతోంది ఏంటంటే వచ్చే ఎన్నికల దాకా వీరికి మాట్లాడే ఛాన్స్ లేదన్నమాట. ఈ విషయమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

కారణం ఏదైనా కూడా ఇలాంటి నిర్ణయాలు మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడు మద్యం దుకాణాల సంఖ్యపై సభా వేదికగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే కారణంగా ఆయనపై వేటు పడింది. అయితే ఇలాంటి చర్యలు గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు వైసీపీ కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకోవడంతో అది చివరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. వైసీపీ కక్షపూరితంగా ప్రవర్తిస్తుందని టీడీపీ శ్రేణులు ఇప్పటికే ప్రచారాలు కూడా మొదలు పెట్టేశాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news