వార్నింగ్ బెల్: ఆ ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్..

-

ఏపీలో అధికార వైసీపీకి ఎంత బలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్రతి జిల్లాల్లోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది. అన్నీ వర్గాల ప్రజలు జగన్‌కు మద్ధతుగా నిలుస్తున్నారు. ఆ విషయం తాజాగా వెలువడిన ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాల్లో అర్ధమైంది. అయితే ఈ ఫలితాలు ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనమా? అంటే ఇవి ఎమ్మెల్యేల పనితీరు కంటే జగన్ ఇమేజ్‌కు నిదర్శనమనే చెప్పొచ్చు.

Ys-Jaganmohan-Reddy
Ys-Jaganmohan-Reddy

2019 ఎన్నికల్లో జగన్‌ని చూసే వైసీపీకి అంతమంది ఎమ్మెల్యేలని ఇచ్చారు. ఇప్పటికీ స్థానిక ఎన్నికల్లో కూడా జగన్‌ని చూసే జనం వైసీపీని గెలిపిస్తున్నారు అని చెప్పొచ్చు. మరి జగన్ ఇమేజ్‌తోనే బండి లాగించాలంటే చాలా కష్టమనే చెప్పొచ్చు. ఎంతకాలం ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్ పెంచుకోకుండా జగన్ బొమ్మ పట్టుకుని గెలవాలని చూస్తారనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.

అందుకే పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ బెల్ మోగించారని తెలిసింది. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన టీం…ప్రభుత్వం, పార్టీ, ప్రజాప్రతినిధుల పనితీరుపై సర్వే చేయనుందని చెప్పారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ తతంగం మొదలు కానుంది. కాబట్టి పీకే టీం రంగంలోకి దిగే లోపే ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని జగన్ ముందే హింట్ ఇచ్చేశారట. పీకీ టీం ఎంట్రీ ఇచ్చేసరికి అందరూ మంచి పనితీరు కనబర్చాలని సూచించినట్లు తెలిసింది.

అంటే ఎమ్మెల్యేలు మళ్ళీ గ్రామాలు, పట్టణాలలో వార్డుల బాట పట్టాలనే వ్యూహంతోనే జగన్ ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్ళేందుకు కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఆ ఇబ్బందులని అధిగమించి ఎమ్మెల్యేలు సత్తా చాటితేనే నెక్స్ట్ సీటు ఉంటుందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news