భారత్‌లో కొత్త సిద్ధాంతం.. ప్రశ్నించిన వారిపై దాడులు : రాహుల్‌ గాంధీ

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లండన్ లో ఆయన ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేఏ)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ లో కొత్త సిద్ధాంతం అమలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారని రాహుల్ గాంధీ వెల్లడించారు.

PM doesn't care': Rahul Gandhi calls Budget 2023 'Mitr Kaal' | Mint

ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకోకపోతే ఇలాగే జరుగుతుందని, బీబీసీకి ఎదురైన పరిస్థితి కూడా ఆ కోవలోకే వస్తుందని వివరించారు. గత 9 ఏళ్లుగా భారత్ లో ఉన్న పరిస్థితి ఇదేనని స్పష్టం చేశారు. భారత్ లోని దళితులు, బలహీన సామాజిక వర్గాల ప్రజలు నోరెత్తకూడదని బీజేపీ భావిస్తోందని, దేశ సంపదనంతా నలుగురైదుగురికి పంచాలని ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కొన్నిరోజుల కిందట కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగం సందర్భంగానూ రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. భారత్ లో మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరుల్లా చూస్తున్నారని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news