సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు : సజ్జల రామకృష్ణ రెడ్డి

-

2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఓ ఆలోచనా విధానంతో పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. రాబోయే రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వారంలో 2, 3 రోజులు ప్రజల్లో ఉండాలని అన్నారు సజ్జల. ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు వారంలో 2,3 రోజులు ప్రజల్లో ఉండాలని జగన్ సూచించినట్లు సజ్జల వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం కార్యాచరణ నిర్దేశించారన్నారు.

Govt would bring Anti-CAA law if necessary: Sajjala Ramakrishna Reddy

ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తాం. ఉద్యోగులపై ప్రభుత్వం పాజిటివ్‌గా ఉందన్నారు. అంతేకాకుండా ఉద్యోగుల బాధ్యత ప్రభుత్వందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే ఏజండాగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news