నేడు ఐపీఎల్‌లో రసవత్తర పోరు జరుగుతోంది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లోటాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. 11 పరుగులు వద్ద ఆర్‌సీబీ తొలి వికెట్ చేజార్చుకుంది. అయితే విరాట్ కోహ్లి 53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ తో 58 పరుగులు చేయగా, రజత్ పటిదార్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగుల చేసి అర్ధ సెంచరీలతో రాణించాడు.
నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 19వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఫెర్గుసన్ పెవిలియన్‌కు పంపించడంతో ఆర్సీబీ భారీ స్కోర్ ఆశలకు గండిపడింది. ఆఖరి ఓవర్లో లోమ్రార్ ఓ సిక్సర్, ఫోర్ సహా 15 పరుగులు రాబట్టడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సాంగ్వాన్ 2 , షమీ, జోసఫ్, ఫెర్గుసన్, రషీద్ ఖాన్ లు తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.