కుప్పంలో బాబుకు సెగలు…వైసీపీ ఛాన్స్ ఇవ్వట్లేదుగా!

-

కుప్పంలో మళ్ళీ పికప్ అవ్వాలని చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు….అసలు ఇంతవరకు నామినేషన్ వేయడానికి వెళ్లకుండా గెలిచిన బాబు…ఇప్పుడు పదే పదే కుప్పం వెళ్లాల్సిన పరిస్తితి వచ్చింది. ఆ పరిస్తితికి చంద్రబాబుని వైసీపీ తీసుకొచ్చింది. వరుసగా 7 సార్లు కుప్పంలో సత్తా చాటిన చంద్రబాబుకు వైసీపీ అధికారంలోకి వచ్చాక చుక్కలు కనబడటం మొదలయ్యాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ఫోకస్ చేసి పనిచేయడం మొదలుపెట్టారు…కుప్పంలో బలంగా ఉన్న టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారు.

అలాగే వరుసపెట్టి పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాలు సాధించేలా చేశారు. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో బాబుకు జ్ఞానోదయం అయింది…కుప్పంపై ఫోకస్ చేయకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో రిస్క్ తప్పదని భావించారు. అందుకే రెండు, మూడు నెలలకొకసారి కుప్పం వెళుతూ అక్కడ పార్టీ పరిస్తితులని చక్కదిద్దే కార్యక్రమాలు చేస్తున్నారు.

టీడీపీలో ఉంటూ వైసీపీకి సహకరించే నేతలని పక్కన పెట్టేసి…కష్టపడి పనిచేసే నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ పరిస్తితులని సరిచేసుకుంటున్నారు. తాజాగా కూడా బాబు కుప్పం పర్యటనకు వెళ్లారు…అక్కడ ప్రజలతో మాట్లాడుతూ…వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలతో బేటీ అయ్యి, పార్టీ బలోపేతంపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా బాబు కుప్పంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.

అయితే బాబు ఎంత ఫోకస్ పెడితే…అంత ఎక్కువగా వైసీపీ కూడా ఫోకస్ పెడుతుంది…అలాగే బాబుకు పోటీగా కార్యక్రమాలు చేస్తుంది..తాజాగా బాబు పర్యటనలో వైసీపీ శ్రేణులు దూకుడు ప్రదర్శించాయి..వైసీపీ జెండాలతో హల్చల్ చేశారు. దీంతో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ మరింత పెద్దయ్యేలా ఉంది…ఇప్పటికే తాజాగా జరిగిన గొడవకు నిరసనగా వైసీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేసేలా ఉంది. అటు టీడీపీ కూడా పోటీగా రంగంలోకి దిగుతుంది. దీని వల్ల బాబు వచ్చిన అసలు పని కంటే…ఈ రచ్చ ఎక్కువ అయ్యేలా ఉంది. అంటే కుప్పంలో టీడీపీ బలోపేతం కోసం చేసే కార్యక్రమాలు కంటే…వైసీపీ శ్రేణులని ఎదుర్కోవడమే ఎక్కువైపోయింది. మొత్తానికి కుప్పంలో బాబుని త్వరగా పికప్ అవ్వనిచ్చేలా లేరు.

Read more RELATED
Recommended to you

Latest news