ఆరునెలలు సిన్మాలు గిన్మాలు పక్కకు పెట్టండి… ప్రభుత్వ ఉద్యోగాలపై మంత్రి కేటీఆర్

-

ఆరు నెలలు సినిమాలు పక్కకు పెట్టండి అని పోటీతత్వంతో కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రంలో కూడా 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాళ్లు కూడా నింపకతప్పదని అన్నారు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కాదని… రాష్ట్రంలో 19 వేల పరిశ్రమలు వచ్చాయని.. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే సంస్థలకు రాయితీలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 90 వేల ఉద్యోగాల గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాలుగు రోజుల్లోనే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. ప్రపంచంతో పోటీపడే పౌరులుగా యువత తయారు కావాలని అన్నారు. స్కీల్, రీస్కిల్, అప్ స్కిల్ తో యువత ముందుకు వెళ్లాలని సూచించారు. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు.

గత ప్రభుత్వాలు లో యువత కి సరైయినా అవకాశాలు రాలేదని..ప్రపంచంలో ఉన్న టాప్ ఐ టీ కంపెనీ లు హైద్రాబాద్ లో ఉన్నాయి.. అది కేటీఆర్ ఘనత అని..ఎంత కష్టపడితే అంత సక్సస్ అవుతారని మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత మాట్లాడటం కష్టం అని ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని చమత్కరించారు మంత్రి కేటీఆర్

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news