హైదరాబాద్ ఎంపీ సీటు గెలుస్తామని.. ఆ తర్వాత పాత బస్తీ నుంచి ఎంఐఎం గుండాలను తరిమి కొడతామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ ను గెలవటమే బీజేపీ లక్ష్యమని.. తెలంగాణ కాషాయ అడ్డ అన్నారు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక దారూసలాంను ఆక్రమిస్తామని.. అవకాశం ఇస్తే.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.
పాతబస్తీలో హిందువుల ఘర్ వాపసీ కార్యక్రమం మెదలుపెడతామని.. భాగ్యనగరానికి ఐకాన్ గా భాగ్యలక్ష్మీ దేవాలయం నిలిచిందని వెల్లడించారు. పాతబస్తీ హిందులకు అడ్డా.. ఎంఐఎం ఆగడాలను భరించలేక చాలా మంది బయటకు వెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైద్రాబాద్ పార్లమెంట్ ను బీజేపీ ఎందుకు గెలవదో చూద్దామని… ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణను విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. యూనిఫాంతో మాత్రమే పాఠశాలకు రావాలనటంలో తప్పేంటి ? అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయం ను పునర్నిర్మానం చేస్తామని ప్రకటన చేశారు.