పాలమూరులో కారు జోరు..ఆ సీట్లలో లీడ్.!

-

పాలమూరులో: ఉమ్మడి మహబూబ్‌నగర్(పాలమూరు) జిల్లా..తెలంగాణలో గెలుపోటములని శాసించే జిల్లాల్లో ఇది ఒకటి. ఇక్కడ మెజారిటీ వచ్చిన పార్టీ..రాష్ట్రంలో గెలవడం పక్కా అనే పరిస్తితి. ఇక తెలంగాణ వచ్చాక గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాలో బి‌ఆర్‌ఎస్ పార్టీదే హవా..దీంతో రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి వస్తూనే ఉంది. ఇక ఈ సారి కూడా ఈ జిల్లాలో సత్తా చాటి..ఆధిక్యం తెచ్చుకోవాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేస్తున్నారు.

14 సీట్లు ఉన్న ఈ జిల్లాలో గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటింది. ఒక్క కొల్లాపూర్ తప్ప మిగిలిన సీట్లని బి‌ఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. కొల్లాపూర్ లో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి..నెక్స్ట్ బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చేశారు. దీంతో జిల్లాలో బి‌ఆర్‌ఎస్ కు సంపూర్ణ మెజారిటీ ఉంది. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా ఇక్కడ ఆధిక్యం సాధించాలని బి‌ఆర్‌ఎస్ చూస్తుంది. కాకపోతే గత ఎన్నికల్లో వచ్చినంత గా ఈ సారి సీట్లు రాకపోవచ్చు గాని..బి‌ఆర్‌ఎస్ ఆధిక్యం మాత్రం కొనసాగేలా ఉంది.

అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్, బి‌జే‌పిలు బలపడుతున్నాయి. దీంతో ‌బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుంది. ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీకి కొన్ని సీట్లలో ఆధిక్యం అలాగే ఉంది. వనపర్తి, షాద్‌నగర్, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట్, ఆలంపూర్, జడ్చర్ల లాంటి స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి లీడ్ ఉంది. ఇంకా కొడంగల్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, కొల్లాపూర్ లాంటి స్థానాల్లో బి‌ఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బి‌జే‌పిలు గట్టి పోటీ ఇస్తున్నాయి.

అదే సమయంలో బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలిపోతే బి‌ఆర్‌ఎస్ పార్టీకే బెనిఫిట్ అవుతుంది. ఏదేమైనా మళ్ళీ పాలమూరులో కారు ఆధిక్యం సాధించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news