ఢిల్లీలోనే సీఎం కేసీఆర్‌ మకాం..కేజ్రీవాల్‌ తో నేడు కీలక సమావేశం

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు.. చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీనే టార్గెట్‌ చేస్తూ.. వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్‌. ఇందులో భాగంగానే.. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే,తమిళ నాడు సీఎం స్టాలిన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఇలా చాలా మంది కీలక నేతలను సీఎం కేసీఆర్‌ స్వయంగా కలిసి.. కేంద్రంపై యుద్దం ప్రకటించారు.

ఇక ఈ నేపథ్యంలోనే… నిన్న రాత్రి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. సాధారణంగా సీఎం కేసీఆర్‌ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా… కేంద్ర పెద్దలతో.. భేటీ అయ్యేందుకు వెళ్లేవారు. కానీ ఈ సారి మాత్రం ఆయన ఢిల్లీ టూర్‌ ముఖ్య ఉద్దేశ్యం వేరు.

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తో భేటీ అయ్యేందుకు సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం అందుతోంది. ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తో సమావేశమై.. బీజేపీ పార్టీ వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించి చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఆ సమావేశం అనంతరం.. ఢిల్లీలో నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం పనులను కూడా సీఎం పరిశీలించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news