సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన ఐదు ఎకరాల భూమి కేటాయింపుపై సిఎం కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజూరు చేసినా భూ కేటాయింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. కార్మికుల తక్షణ వైద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఆసుపత్రికి ఐదు ఎకరాల భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

కాగా పరిశ్రమలకు కేంద్రమైన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒప్పంద కార్మికులకు మెరుగైన వైద్యం కలగానే మారుతోంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 22 వేల మంది ఒప్పంద కార్మికులు ఉన్నారు. రూ. 21 వేల లోపు వేతనం ఉన్న కార్మికులు ఈఎస్ఐ లో సభ్యులుగా చేరుతారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి, సింగరేణి అనుబంధ పరిశ్రమలు, ఎన్టిపిసి, కేశోరాం సిమెంట్ పరిశ్రమ, విద్యాసంస్థలు, హెచ్కెఆర్, సినిమాహాలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం ఎదురుచూపులు తప్పడంలేదు.

Read more RELATED
Recommended to you

Latest news