ట్విట్టర్ యుద్ధాలు నీకెందుకు చిన్న దొర ? : కేటీఆర్‌ పై షర్మిల సెటైర్‌

-

గత రెండు రోజుల టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య ట్విట్టర్‌ వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుంటూ.. తెలంగాణ రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మంత్రి కేటీఆర్‌ కు కౌంటర్‌ ఇచ్చారు వైఎస్‌ షర్మిల.  చిన్నదొర నీకు ట్విట్టర్‌ యుద్దాలు నీ ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు షర్మిల. ” చిన్నదొర గారి సొంత నియోజకవర్గంలో అప్పులపాలైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చేనేత మంత్రి గారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పులపాలై చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేటీఆర్‌ గారు ఆదుకోవాల్సింది పోయి గత్తర రాజకీయాలు, ట్విట్టర్ యుద్ధాలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.

తప్పితే అయ్యో అనడానికి నోరు మెదపటం లేదు. సాయమందించటానికి చెయ్యి రావటం లేదని మండిపడ్డారు. పంట పెట్టుబడికి అప్పు తెచ్చి,సాగు నీటికోసం బోర్ల మీద బోర్లు వేసి చుక్క నీళ్లు పడక,కండ్లనుంచి నీటి ధార ఆగక తెచ్చిన అప్పులు తీర్చలేక గోవర్ధన్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే, చేనేత మగ్గం నడువక, బతుకు బండి సాగక బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక చేనేత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం భారమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నల కష్టానికి ఫలితం కరువైందని.. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోని పెద్ద దొర, చిన్న దొర దేశాన్ని ఏలపోవడానికి తెలంగాణ బిడ్డలను గాలికొదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news