ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం వాట్సాప్ స్థంభించిన విషయం తెలిసిందే. వాట్సాప్ మాత్రమే కాకుండా.. ఇన్‌స్టా, ఫేస్ బుక్ సేవలకు కూడా గతంలో అంతరాయం కలిగింది. అయితే.. తాజాగా నేడు ట్విట్టర్ సేవలు కొద్దీ సేపు స్థంభించిపోయాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు భారతదేశంలో ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. అవుట్‌లను డౌన్‌డెటెక్టర్ నివేదించడంతో ట్విట్టర్ పేజీ బ్లాక్‌గా దర్శనమిచ్చింది.
చాలా మంది వినియోగదారుల వారి టైమ్‌లైన్ రిఫ్రెష్ కాలేదు, అయితే చాలా ఖాతాలు స్థంభించిపోయాయి. ట్విటర్ యజమాని ఎలోన్ మస్క్ క్రిప్ట్‌సి ట్వీట్‌ను షేర్ చేసిన కొన్ని గంటల తర్వాత ట్విట్టర్‌లో అంతరాయం ఏర్పడడం గమనార్హం. అందులో అతను “బాట్‌లు రేపు ఆశ్చర్యానికి లోనవుతాయి” అని అన్నారు. అంతరాయాన్ని ధృవీకరించే సోషల్ మీడియా సంస్థ నుండి ఎటువంటి ప్రకటన లేదు.