వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ రావాలంటే దొర అహంకారాన్ని అణిచివేయాలని.. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలపై ఆమె స్పందించారు.
ట్విటర్ లో…కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. ఓ రోజు నోటిఫికేషన్స్ లేక చనిపోయే నిరుద్యోగి వంతు…ఓ రోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతు వంతు… ఓ రోజు ధరణి తప్పుల తడకకు చనిపోయే రైతు వంతు… ఓ రోజు అసైన్డ్ భూముల కోసం బలైన రైతు వంతు…మరో రోజు పోడు భూములకై ఆత్మహత్య చేసుకొనే గిరిజన రైతు వంతు.. ఓ రోజు ఫీల్డ్ అసిస్టెంట్ ల వంతు…ఓ రోజు RTC ఉద్యోగుల వంతు… ఓ రోజు ఫీజు రీయింబర్స్ మెంట్ అందని విద్యార్థి వంతు… ఓ రోజు వైద్యం అందని కరోనా రోగుల వంతు అంటూ.. ఇదే కేసీఆర్ పాలనలో బతకలేని తెలంగాణ అని విమర్శించారు. బంగారు తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలంటే, చావులు లేని తెలంగాణ రావాలంటే దొరగారి అహంకారాన్ని దించాలని పిలుపునిచ్చారు వైఎస్ షర్మిళ