గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆక్కడ‌ ఆశలు వదులుకుందా ?

-

తెలంగాణ శాసనమండలిలో గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. త్వరలో ఈ రెండు స్థానాల ఎన్నికలకు షెడ్యూలు విడుదల అవనుంది. అధికార టిఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును కొద్ది నెలల కిందట మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రెండు గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ నియెజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లను చేర్చించే కార్యక్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న గులాబి పార్టీ గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ సారి రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలనుకుంటోంది అధికార టిఆర్ఎస్. ఒక స్థానానికి అభ్యర్ధిని ఖరారు చేసుకున్న టిఆర్ఎస్ …మరోచోట ఎందుకు స్పష్టతకు రాలేకపోయింది ఆ స్థానం పై ఆశలు వదులుకుందా అన్న చర్చ గులాబీ పార్టీ శ్రేణుల్లోనే నడుస్తుంది…


తెలంగాణ శాసనమండలిలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్‌ తో పాటు, నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఇప్పటికే నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం పల్లా ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియెజకవర్గ పరిధిలో ఓటర్లను కలుస్తున్నారు. ఇటు పార్టీ కూడా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌ చార్జ్‌ లను నియమించింది. పల్లా మరోసారి గెలవటం ఖాయమనే ధీమాను గులాబీ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

అయితే, రెండు గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ నియెజకవర్గాల్లో ఒక్క స్థానంలో మాత్రమే టిఆర్ఎస్ యాక్టివ్ గా ఉండడం ఇప్పుడు చర్చనీయశంగా మారింది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి -హైదరాబాద్ గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ స్థానం విషయంలో గులాబీ పార్టీ వైఖరి ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అభ్యర్ధి ఎవరో స్పష్టత రాకపోవడం ఏమిటనే చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి -హైదరాబాద్ గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ నియెజకవర్గంలో పోటి విషయంలో టిఆర్ఎస్ కు వేరే ఏదైన ఎత్తుగడ ఉందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యూట్రల్ గా ఉండే బలమైన వ్యక్తికి మద్దతు ఇచ్చే అలోచన టిఆర్ఎస్ చేస్తోందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అప్పట్లో ఈ గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటి చేసే విషయంలో ఒకరిద్దరు అధికార పార్టీ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కాని ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఈ స్థానం విషయంలో టిఆర్ఎస్ వైఖరి ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news