పసుపు వానిజ్య పంట..మన దేశంలో ప్రధాన పంటగా పండిస్తున్నారు.50 శాతం తెలుగు రాష్ట్రాలలో పండిస్తున్నారు..పసుపులో రకాలను బట్టి దుంపలను, కొమ్ములను భూమిలో నుంచి వివిధ పద్ధతుల ద్వారా తీస్తున్నారు.
పసుపును ఆహారపదార్ధాలతోపాటు, సుగంధ ద్రవ్యాలు ,ఔషదాల తయారీలో వినియోగిస్తున్నారు. మార్కెట్లో పసుపుకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు పసుపు సాగువైపు ఆసక్తి చూపుతున్నారు.ఎంతో సువాసనతో, పసుపు విలువకు ప్రాధాన్యతనిచ్చే కుర్కుమిన్ పదార్ధం శాతం అధికంగా ఉంటుంది. పసుపు సాగు చేయాలనుకునే రైతులు పంట బాగా ఉండాలంటే ముందుగా విత్తన శుద్ధిలో జాగ్రత్తలు తీసుకోవాలి..దుంప తెగులు నుంచి కాపాడేందుకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి..
దుంప తెగులు లక్షణాలు..
తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు పచ్చగా మారి క్రమంగా ఎండిపోతాయి.
ఆకులు మొదట ఆకుల చివరల నుండి ఎండడం ప్రారంభమయి ఆకు మొత్తం ఎండుతుంది.
తెగులు సోకిన మొక్కల వేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి.
దుంపలు గోధుమ రంగుకి మారిపోయి క్రమంగా దుంప మొత్తం కుళ్ళిపోయి మెత్తగా తయారవుతుంది.
దుంపలు నారింజ రంగుకు మారతాయి.
ఈ తెగుళ్లు అనేవి దుంపల ద్వారా, నీటి ద్వారా మరియు నేల ద్వారా వ్యాప్తి చెందును.
నివారణ..
ఎప్పుడూ పసుపు పంట కాకుండా పంటను మార్చాలి..
పసుపు, అల్లం పంటలను తేలికపాటి నేలలలో సాగు చేయాలి.
మురుగు నీరు పోయే సౌకర్యం ఉండాలి.
ఆరోగ్యవంతమయిన దుంపలను నాటుకోవాలి.
విత్తన దుంపలను మెటలాక్సిల్3గ్రా./ లి. లేదా బోర్డో మిశ్రమం 1% మందు ద్రావణంలో 40 నిమిషాలు నానబెట్టి నాటుకోవాలి.
తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీ క్లోరైడ్2% లేదా మెటలాక్సిల్ 0.25% మందు ద్రావణంను మొదళ్ళ వద్ద పోయాలి.
తెగులును కొంత వరకు తట్టుకొనే పసుపు రకం అయిన పి.సి.టి. – 13,14 లను నాటుకోవాలి..ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తెగుళ్లు నుంచి ఉపశమనం కలుగుతుంది..