విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని భవానిపురం ఈద్గా మైదానంలో జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ నిర్వస్తున్న వక్ఫ్ పరిరక్షణ మహాసభ నిర్వహించగా.. ఈ మహాసభ లో విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్, ఎం.పి లావు కృష్ణ దేవరాయలు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి సేవా కార్యక్రమాలు చేసే సమాజం ముస్లిం సమాజం. పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని సూచించింది తెలుగుదేశం పార్టీ. ఈ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, టిడిపి తీసుకున్న నిర్ణయం.
సీఎం చంద్రబాబు మతస్వామరస్యాన్నికాపాడే నాయకుడు. వక్ఫ్ సవరణ చట్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూలంకషంగా అన్ని ముస్లిం జమాతులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం మీద అభ్యంతరాలు ఉన్నాయని బహిరంగ సభ పెట్టి చర్చించడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు సూచన, సలహా మేరకు. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టాన్ని సబ్ కమిటీ కు పంపవలసిందిగా కోరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ముస్లిం సమాజ అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేయదు. సీఎం చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజం అభివృద్ధి కోసం, వక్ఫ్ ఆస్తులు ఏ విధంగా కాపాడాలి అని నిరంతరం ఆలోచిస్తారు అని కేశినేని పేర్కొన్నారు.