శనివారం రోజు అక్కినేని నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పగా కరాటే కల్యాణితో పాటు అమ్మ రాజశేఖర్ లేదా కుమార్ సాయి బయటకు వెళ్లిపోతారని అందరూ భావించారు. అయితే నిన్న ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే హారిక ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. అయితే హారికను సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారని వార్తలు రాగా ఆ వార్తలు నిజం కాలేదు. ఇక షో నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణిని బిగ్ బాస్ హౌస్ లోని టాప్ 5, లీస్ట్ 5 మెంబర్స్ ఎవరో చెప్పాలని నాగార్జున కోరాడు.
ఆ ప్రశ్నకు కరాటే కల్యాణి సమాధానంగా మోనాల్, దివి, అభిజిత్, హారిక, అమ్మరాజశేఖర్ టాప్ 5లో ఉంటారని.. సాయి, అరియానా, సుజాత, సోహైల్, గంగవ్వ లీస్ట్ 5 లో ఉంటారని చెప్పింది. మిగిలిన వారి గురించి మాట్లాడుతూ లాస్య అయోమయమని, అవినాష్ అమాయక చక్రవర్తి అని, మెహబూబ్ ఇంటెలిజెంట్ అని, అఖిల్ ఆవేశం తగ్గించుకోవాలని, దేవి బ్రిలియంట్ అని పేర్కొంది. మోనాల్ చుట్టూ ముగ్గురు కట్టప్పలు ఉన్నారని కామెంట్ చేసింది.
బిగ్ బాంబ్ లో భాగంగా ఒకరిని నామినేట్ చేయాలని నాగ్ సూచించగా కరాటే కల్యాణి దేవిని నామినేట్ చేసింది. అనంతరం నాగార్జున సాయి, అభిజిత్ సేఫ్ అయినట్టు ప్రకటించాడు. ఆ తర్వాత నాగార్జున బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో బోన్ గేమ్ ఆడించాడు. గేమ్ లో భాగంగా ఎముకను గుండంలో ఉంచి ఎవరు ముందు తింటే వారు గెలిచినట్లు అని నాగ్ చెప్పాడు. ఈ గేమ్ లో అఖిల్, మోనాల్, మెహబూబ్, దేవి, సుజాత, దివి, గంగవ్వ, అవినాష్ గెలిచారు. అందరూ సేఫ్ కాగా ఎలిమినేషన్ లో భాగంగా చివరకు మోనాల్, హారిక మిగిలారు.
ఎలిమినేషన్ లో భాగంగా నామినేట్ కాని హౌస్ మేట్స్ ను మోనాల్, హారికలలో ఎవరిని బయటకు పంపించాలని కోరగా లాస్య, సుజాత. అఖిల్, మెహబూబ్ హారికను అరియానా, దివి, దేవి మోనాల్ ను వెళ్లిపోవాలని సూచించారు. ఆ తర్వాత నాగార్జున హారికను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే నోయల్, అభిజిత్ ఆమెను ఎత్తుకొని తీసుకువచ్చారు. బిగ్ బాస్ ఫేక్ ఎలిమినేషన్ తో కంటెస్టెంట్ల, ప్రేక్షకుల మనోభావాలతో ఆడుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.