ఇంట్రెస్టింగ్ స్టోరి..‘జబర్దస్త్’లో కట్టుకున్న చీరలను ఏం చేస్తారంటే?

-

తెలుగులో సూపర్ హిట్ కామెడీ షో ‘జబర్దస్త్’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో నుంచి వచ్చిన వాళ్లు కొందరు ఇప్పుడు వెండితెరపైన కమెడియన్స్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికీ చాలా మందికి ఈ షో అన్నం పెడుతోంది. జనాలను ఎంటర్ టైన్ చేస్తూ ఈ షో దూసుకుపోతున్నది.

ఈ షో స్టార్ట్ అయిన కొత్తలో కేవలం మగవాళ్లు మాత్రమే స్కిట్స్ వేసే వారు. కానీ, ఆ తర్వాత కాలంలో ఆడవాళ్లు కూడా పార్టిసిపేట్ చేసి జనాలను కడుపుబ్బ నవ్వించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా ఈ షో చాలా మందికి లైఫ్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు.

ఇకపోతే ‘జబర్దస్త్’లో స్కిట్ సందర్భంగా ఆడవాళ్లు కట్టుకున్న చీరలు చాలా అందంగా ఉంటాయి. అవి చూసి జనాలు వావ్ అనుకుంటున్నారు. ఈ సారీలు ‘జబర్దస్త్’ టీమ్ వాళ్లే ఇచ్చారా? అన్న ప్రశ్నలు ఎదురవుతుంటాయి. సత్యశ్రీ కి ఈ ప్రశ్నలు ఎదురు కాగా చీరల గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

 

‘జబర్దస్త్’లో తాను దాదాపు 500 ఎపిసోడ్లలో చీర కట్టుకున్నానని, అయితే, కట్టిన చీర మళ్లీ కట్టలేదని తెలిపింది. అయితే, షో నిర్వాహకులు కూడా చీరలు ఇస్తారని, అయితే, ఎప్పుడూ ఒకటే చీర కాకుండా మార్చి మార్చి చీరలు కట్టిస్తారని చెప్పింది సత్యశ్రీ.

Read more RELATED
Recommended to you

Latest news