కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

4316

ఈ రోజుల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే మాట తరచుగా వింటూనే ఉన్నాం. కిడ్నీలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నా ఆహారపు అలవాట్ల వల్ల, కాలుష్యం వల్ల, హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్ వంటి వ్యాధుల వల్ల వాటి పనితీరు దెబ్బ తిని ప్రాణాల మీదకి తెస్తున్నది. ఈ సమస్య గురించి కాస్త సమయం వెచ్చించి జాగ్రత్తలు తీసుకుంటే చాలా కిడ్నీలు పదిలంగా ఉంటాయి.

కిడ్నీలు చూడ్డానికి చిన్న చిక్కుడు గింజల్లాగా కనిపించినా వాటి పనితీరు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. వాటి పరిమాణం కేవలం 4.5 అంగుళాలు . కానీ, ఆరోగ్యం పట్ల తీసుకునే శ్రద్ధ మాత్రం అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలంటే గుండెలో కన్నా, మెదడులో కన్నా రక్తప్రసరణ ఎక్కువగా జరిగేది మూత్రపిండాల్లోనేనట. ప్రతి అరగంటకి కిడ్నీలు శరీరంలోని రక్తాన్ని శుద్ది చేసి, టాక్సిన్స్‌ని తొలిగిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

1. కిడ్నీల పనితీరు బాగుండాలంటే నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి.

2. వీటికి బలాన్నిచ్చే ఆహారం తింటే పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, ఆపిల్, కాలీఫ్లవర్, వెల్లుల్లి, ఉల్లిపాయ, వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.

3. నొప్పులు వస్తే వాడే ఆస్ప్రిన్, బ్రూఫిన్ లాంటి మాత్రలు వాడడం పూర్తిగా తగ్గించాలి. ఇవి కిడ్నీల మీద తమ దుష్పభావాన్ని చూపిస్తాయి.

4. కాఫీ, టీ లను కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకుండా నియంత్రించుకోవాలి.

5. రాత్రిళ్లు మరీ ఆలస్యం కాకుండా బోజనం చెయ్యాలి. దీనివల్ల కిడ్నీల పనితీరు బాగుంటుంది. కిడ్నీ సమస్యలతో బాదపడేవారు ఎక్కువ శాతం సాల్మన్ చేపని ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.

6. గుడ్డులోని తెల్లసొన కిడ్నీలకి మంచిదని చెబుతున్నారు వైద్యులు.

7. హై ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని కూడా నియంత్రించుకోవాలి.

8. ఆహారంలో ఎక్కువశాతం ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది.

9. ఉదయాన్నే నిద్రలేవగానే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తిన్నా మంచిది.

ఆరోగ్యానికి అన్ని విధాలా దోహద పడే కిడ్నీల పట్ల చూపించే కొద్దిపాటి జాగ్రత్త చాలు.