మీ శరీరంలో హార్మన్ల అసమతుల్యత రావడానికి ఇవే కారణాలు.. ఇష్టంలేని పనులే చేస్తున్నారా..?

-

Hormonal imbalance: మనకు వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు వైద్యులు ముఖ్యంగా చెప్పేది హార్మన్ల అసమతుల్యత.. మనిషిని సంతోషంగా ఉంచాలన్నా, ఏడిపించాలన్నా, బాధించాలన్నా ఈ హార్మోన్ల చేతుల్లోనే ఉంది.. మనలో హ్యాపీ హార్మోన్లు ఎక్కువగా ఉంటే.. మనసు హాయిగా ఉంటుంది, ఏ పని అయినా చేసేంత ఎనర్జీ ఉంటుంది. అదే సాడ్‌ హార్మోన్లు ఉంటే.. మన ముందు ఏం సమస్య లేకున్నా.. ఏదో ఉన్నట్లు.. గతాన్ని గడ్డపారపెట్టి తవ్వుకోని మరీ భాదపడతాం.. మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి మీ శరీరంలో జరిగే ప్రతీ చర్యకు హార్మోన్లు బాధ్యత వహిస్తాయి. మీ శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి వివిధ హార్మోన్లు నిర్దిష్ట మొత్తంలో కావాల్సి ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత, హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా భావోద్వేగాలలో మార్పులు కలుగుతాయి. మీకు అప్పుడప్పుడు కోపం, ఆనందం, వికారం, విసుగు, డిప్రెషన్ కలగటానికి కూడా ఈ హార్మోన్లే కారణం.

 Hormonal imbalance
Hormonal imbalance

అయితే శరీరంలో హార్మోన్ల అసమానతలు కలగడానికి మీరు బాహ్యంగా ఇచ్చే కొన్ని ఆహారాలే కారణం.. వాటిని నియంత్రణలో ఉంచుకుంటే హార్మోన్లను కూడా సమతుల్యంగా ఉంచుకోవచ్చు.

కెఫిన్
కెఫిన్ అధికంగా తీసుకుంటే మన హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కెఫిన్ అనేది శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పెరిగిన కార్టిసాల్ స్థాయిలు మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తాయి. బాధలు, నొప్పిని దిగమింగుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇతర అనర్థాలకు కూడా దారితీస్తుంది.. జంక్ ఫుడ్ తినడం, ఆల్కాహాల్ అతి వినియోగం కూడా ఇలాంటి దుష్రభావాలను కలిగి ఉంటుంది.

సరిపోని నిద్ర
మన శరీరానికి ఎనర్జీ కావాలంటే.. సరిపడా నిద్రపోవాలి.. నిద్ర లేచిన తర్వాత మనిషీ మళ్లీ యాక్టివ్‌ అవుతాడు.. మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత విశ్రాంతి అవసరం. మీకు తగినంతగా విశ్రాంతి లేకపోతే, ఒత్తిడి ప్రతిస్పందనలు పెరుగుతాయి. అలసట, నీరసంతో పాటు మానసిక అశాంతికి దారితీస్తుంది.

భోజనం చేయకపోవడం

చాలా మంది ఉదయం టిఫెన్‌ స్కిప్‌ చేస్తారు.. అటుఇటుగా లంచ్ చేసేస్తారు.. ఇంకొంతమంది అయితే… మధ్యాహ్న భోజనం కూడా చేయలేని తీవ్రమైన షెడ్యూల్‌లను కలిగి ఉంటారు.. ఈ అలవాట్లు కూడా మీ సాధారణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది దీర్ఘకాలంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది..

అయిష్టతతో కూడిన పనులు

మన మనసుకు నచ్చని పనులు చేస్తే.. అది ఎంత చిన్నది అయినా మీకు కష్టంగానే అనిపిస్తుంది. కేలరీలను బర్న్ చేయడానికి శారీరక శ్రమలో పాల్గొనడం, వ్యాయామం చేయడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మీరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కష్టంగా వ్యాయామం చేయడం, ఇష్టంలేని పనులు చేస్తూ నిరంతరంగా ఒత్తిడిని అనుభవించడం వంటివి హార్మోన్ల అసమతుల్యతకు దారితీయవచ్చు.

రసాయనాలు
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, అల్యూమినియం డబ్బాలు, కొన్ని సౌందర్య సాధనాలు ఎండోక్రైన్ విధులకు అంతరాయం కలిగించే టాక్సిన్‌లను కలిగి ఉంటాయి. ఎండోక్రైన్ అనేది హార్మోన్ స్రావానికి బాధ్యత వహించే ఒక వ్యవస్థ. మీ శరీరంలో టాక్సిన్లు చేరినపుడు హార్మోన్ల అసమతుల్యత కలగవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news