ఔరంగజేబు కంటే చంద్రబాబు ప్రమాదం : కొడాలి నాని

-

ఔరంగ జేబు కంటే చంద్రబాబు నాయుడు చాలా ప్రమాదకరమని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే 45 వేల బెల్టుషాపులు తొలగించారని..పర్మిట్‌ రూమ్‌లను పూర్తిగా ఎత్తివేయించారని నిప్పులు చెరిగారు. బార్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర‍్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.

అభివృద్ధి పనులను అడ్డుకుంటే టీడీపీ రాజకీయ భవిష్యత్తుకు జనం సమాధి కడతారని… ఎన్నికల వరకు ఈ 420 బ్యాచ్‌ భరించక తప్పదని హెచ్చరించారు. 175 నియోజకవర్గాలను 175 జిల్లాలను చేయమని లోకేష్ అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు.

అప్పట్లో కుప్పంని డివిజన్ చేయాలని చంద్రబాబుకు ఎందుకు అనిపించలేదు? ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌కు ఎలా ఉత్తరాలు రాస్తాడు? కాస్తయినా చంద్రబాబుకి సిగ్గులేదా? అని మండి పడ్డారు కొడాలి నాని. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని… దేనికీ పనికిరాని చంద్రబాబుని అల్లుడుని చేసుకుంటే ఔరంగజేబులాగా మారాడని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారన్నారు. వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబు అంటూ కొడాలి నాని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news