వైసీపీకి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా

-

ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపికి రాజీనామా చేశాడు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు. ఈరోజు వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే టీవీ రామారావు. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . కొవ్వూరులో తన అభిమానులు, అనుచరులతో సమావేశమైన రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో, తమను నమ్ముకున్న అనుచరులకు సరైన న్యాయం చేయలేకపోతున్నాను.. తీవ్ర మనస్థాపంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నా. అనుచరుల సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి వస్తారని స్పష్టం అవుతుంది.

Ex MLA TV Ramarao resigns to YSRCP

కాగా, 2009లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీచేసిన టీవీ రామారావు. ఎమ్మెల్యేగా తాను విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కానీ, పార్టీ అభ్యర్థి కేఎస్ జవహర్కు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లోనైనా టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించినా టికెట్ మాత్రం రాలేదు. దీంతో.. టీడీపీకి గుడ్బ్భై చెప్పిన ఆయన 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొవ్వూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తానేటి వనితకు మద్దతుగా ప్రచారం చేసి ఆమె విజయం కోసం కృషి చేశారు. ఇక, ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడంతో, ఏ పార్టీలో చేరుతారన్నది ఇంకా స్పష్టం కాలేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news