శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

-

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కరోనా, లాక్ డౌన్ వల్ల రెండేళ్లుగా నిరాడంబరంగా జరిగిన బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది కన్నులపండువగా చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను ఇవాళ నిర్వహించనున్నారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే అంకురార్పణ కార్యక్రమాలు ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. రాత్రి ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు. అక్టోబరు 2న సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నట్లు టీటీడీ అంచనా వేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news