ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దూసుకెళ్తున్న యువనేత

-

 

 

ప్రకాశం జిల్లా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎందరో హేమహేమీలు రాష్ట్ర మరియు జిల్లా రాజకీయాలను శాసించారు. ఈ జిల్లా లో ఉన్న అన్ని రాజకీయ కుటుంబాల వారసులు ప్రస్తుతం రాజకీయాల్లో ఆయా పార్టీల తరుపున క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారిలో ముఖ్యంగా దామచర్ల కుటుంబం ఒకటి.

జిల్లా లోని టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామానికి చెందిన దామచర్ల ఆంజనేయులు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. మంత్రిగా ఉన్నప్పు జిల్లాను ఏంతో అభివృద్ధి చేశారు.  తర్వాత కాలంలో ఆయన రాజకీయ వారసుడిగా వచ్చిన దామచర్ల జనార్దన్ సైతం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబానికి చెందిన యువకుడైన దామచర్ల సత్య సైతం జిల్లా రాజకీయాల్లో బలమైన నేతగా ఎదుగుతున్నారు.
సత్యగా జిల్లా ప్రజలకు అందరికి సుపారిచితులైన దామచర్ల సత్య పూర్తి పేరు దామచర్ల సత్యనారాయణ. వైజాగ్ గీతం విశ్వవిద్యాలయం లో బీటెక్, ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసిన సత్య తమ కుటుంబానికి చెందిన వ్యాపారాల్లో భాగమయ్యారు. తాత ఆంజనేయులు ద్వారా చిన్నతనం నుంచే రాజకీయాలు మీద ఆసక్తి పెంచుకున్న సత్య తెలుగుదేశం పార్టీలో చేరి 2014 లో కొండపి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి స్వామి గారి గెలుపులో కీలకమైన పాత్ర పోషించారు.
పార్టీ కోసం సత్య చేస్తున్న కృషి ని గుర్తించిన అధినేత చంద్రబాబు, లోకేష్ లు రాజకీయంగా  ప్రోత్సహించడం జరిగింది. అధినేత ఆదేశాల మేరకు 2014 నుంచి కొండపి నియోజకవర్గంతో పాటు పక్కనున్న కందుకూరు , ఒంగోలు నియోజకవర్గాల్లో సైతం పార్టీ బలోపేతానికి కీలకంగా కృషి చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గంలో పార్టీని గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేసి సఫలీకృతం అయ్యారు.
2019 ఎన్నికల తర్వాత జిల్లాలో పార్టీని పటిష్టపరిచేందుకు పార్టీ  అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి  లోకేష్  తీసుకున్న చర్యల్లో భాగంగా సత్య ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడంతో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ప్రమోషన్ దక్కించుకున్నారు. జిల్లాలో జరిగిన అమరావతి రైతుల పాదయాత్ర సందర్బంలో క్రియాశీలకంగా పాల్గొని వారికి సంఘీభావంగా వారితో కలిసి నడిచారు.
ఈ మధ్యనే సత్య ను చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకుడిగా పార్టీ అగ్రనాయకత్వం నియమించింది. రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించేందుకు శ్రామిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news