బాబుకు మోదీ సిగ్నల్..కలిసే పోటీ?

-

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో అర్ధం కాకుండా ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి..నెక్స్ట్ గెలిచి అధికారం దక్కించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎన్ని చేసిన చివరికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్ధతు ఉండాలని అటు జగన్, ఇటు చంద్రబాబు కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా..పరోక్షంగా అయిన సపోర్ట్ ఉంటే..నెక్స్ట్ ఎన్నికల్లో కాస్త ఇబ్బందులు ఉండవని ఇరువురు నేతలు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో మోదీ సర్కార్ మద్ధతు పరోక్షంగా జగన్‌కు దక్కింది. దీని వల్ల అధికార వర్గాల బలం, ఇతర ఇతర అంశాల్లో జగన్‌కు సహకారం లభించింది..దీని వల్ల వైసీపీ గెలుపుకు హెల్ప్ అయింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సైతం బీజేపీ మద్ధతు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. అవసరమైతే పొత్తు పెట్టుకోవడానికైనా రెడీ. దీని కోసం ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. అటు జగన్‌కు మోదీ సర్కార్ మద్ధతు పరోక్షంగా లభిస్తూనే ఉంది.

ఇదే సమయంలో చంద్రబాబు కూడా మోదీ మద్ధతు కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఏళ్ల  తర్వాత ఆ మధ్య మోదీని చంద్రబాబు కలిశారు. మళ్ళీ ఇప్పుడు జీ-20పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే పలు సూచనలు చేశారు. ఆ తర్వాత జరిగిన తేనీటి విందులో మోదీ..చంద్రబాబుని పలకరించారు. కొంతసేపు వారి మధ్య కుశల ప్రశ్నలు నడిచాయి. అటు మోదీ..జగన్‌ని సైతం కలిశారు.

అయితే బాబుని మోదీ కలవడంతో బీజేపీ మద్ధతు ఉంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ బీజేపీ రెండువైపులా బ్యాలెన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఓ వైపు బాబు, మరోవైపు జగన్‌తో ఒకే తీరులో ఉన్నారు. అలాంటప్పుడు బీజేపీ రాజకీయం ఏంటి అనేది ఎవరికి అర్ధం కాకుండా ఉంది. మరి బీజేపీ మద్ధతు కోసం బాబు ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news