Breaking : ఢిల్లీకి బండి సంజయ్‌.. బీజేపీ పెద్దలతో భేటీ

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఆయన రేపు అమిత్‌షాతో భేటీకానున్నారు. మునుగోడు ఉపఎన్నిక వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. కాగా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఇదిలా ఉంటే.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఇందిరాపార్క్ వద్ద నిరసన చేస్తున్న వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మహిళా వీఆర్ఏలను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత 79 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తుంటే కనీసం స్పందించని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఆడబిడ్డలను నిర్బంధించి తన క్రూరమైన మనస్తత్వాన్ని చాటుకుందన్నారు. అంతే కాకుండా సమ్మె కాలంలో జరిగిన 50 మందికి పైగా వీఆర్ఏల మరణాలకు తెలంగాణ ప్రభుత్వానిదే బాద్యత అన్నారు బండి సంజయ్. మహిళా వీఆర్ఏలను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం దుర్మార్గమని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. బతుకమ్మతో ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడిగితే అరెస్ట్ చేస్తారా? అని నిలదీసారు.

Read more RELATED
Recommended to you

Latest news