BRS దూకుడు.. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ప్రారంభం

-

ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు కేసీఆర్.తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ గా మార్చారు. ఈ నేపథ్యంలో, దేశ రాజధాని ఢిల్లీలో తాత్కాలిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 14న ప్రారంభించనున్నారు.

BRS targeting 50-80 LS seats, says Suresh Reddy- The New Indian Express

మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో సీఎం కేసీఆర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా యాగం చేపట్టనున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ లు నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఓ వాస్తు నిపుణుడితో కలిసి యాగశాల స్థలం పరిశీలించారు. మరికొందరు పార్టీ నేతలు నేడు, రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news