సీఎం ఇలాకాలో బాబు పాగా ? అంతా మంచికేనా !

-

సీఎం జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప జిల్లాలో చంద్ర‌బాబు హ‌వా న‌డుస్తోంది. ఇక్క‌డ టీడీపీలో చేరేందుకు మాజీ మ‌ళ్లీ ఉత్సాహం చూపుతున్నారు. ఈ ప‌రిణామాల కార‌ణంగా టీడీపీ బ‌ల‌ప‌డుతుందా లేదా అన్న‌ది అటుంచితే పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు పెరిగిపోతున్నాయ‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. అందుకే బాబు ఆచితూచి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించారు. మాజీ ఎమ్మెల్యేలు అయిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి (మైదుకూరు) , వీర శివారెడ్డి (క‌మలాపురం), వ‌ర‌ద రాజుల రెడ్డి (ప్రొద్దుటూరు) ఇటుగా వ‌చ్చేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉన్నారు.

కానీ వీరిలో  డీఎల్ రవీంద్రా రెడ్డికి నో ఛాన్స్ అని తెలుస్తోంది. ఇదే విష‌యం ప్ర‌ధాన మీడియా కూడా ధ్రువీక‌రిస్తోంది. ఇంకా మిగిలిన ఇద్ద‌రికి మాత్రం కాస్తో కూస్తో సానుకూల‌త ఉంద‌నే తెలుస్తోంది. వీర శివారెడ్డికి మాత్రం లోకేశ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌నే స‌మాచారం. ఇక పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త క‌ల‌హాలు పెరిగేందుకు వీరి రాక ఉప‌యోగ‌ప‌డుతుందేమో కానీ అంత‌కుమించి కొత్త చేకూరే లేదా ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌ని కొంద‌రు టీడీపీ అభిమానులు అధిష్టానంతో మాట్లాడుతున్నారు. నేరుగానే అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో  క‌డ‌ప‌లో మ‌ళ్లీ  వైభవం తెచ్చుకోవాలంటే మాజీ సీఎం కు మ‌రింత స‌మ‌యం పట్టే విధంగానే ఉంది.

డీఎల్ కు ఎందుకు నో ఛాన్స్ అంటే గ‌తంలో కూడా ఆయ‌న పార్టీలో ఉంటూ విప‌క్ష నేత మాదిరి మాట్లాడిన దాఖ‌లాలు ఉన్నాయి. అత్యంత వివాదాస్ప‌ద స్వ‌భావం ఉన్న నేత కావ‌డంతో ఆయ‌న‌కు నో ఎంట్రీ చెప్పి ఉండ‌వ‌చ్చు.  జగ‌న్ లాంటి బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఢీ కొనే క్ర‌మంలో వీర శివారెడ్డి హె ల్ప్ కావొచ్చు. అదేవిధంగా బీటెక్ ర‌వి లాంటి వారు మాట్లాడుతున్నా ఆయ‌న‌కు కూడా అంత‌ర్గ‌త శ‌త్రువులే ఉన్నారు. కొంత‌లో కొంత జ‌గ‌న్ ను ఢీ కొనే యువ నేత‌గా పేరున్నా కూడా ఓ వ‌ర్గం ఆయ‌నపై ఆధిప‌త్యం సాధించేందుకు పూర్వం ఉన్న నాయ‌కుల‌ను మ‌ళ్లీ ఇటుగా తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పులివెందుల‌లో పోటీకి బీటెక్ రవి సిద్ధం అవుతున్నార‌న్న స‌మాచారం అందుతుంటే, మ‌రో వ‌ర్గం మాత్రం అధిష్టానం ఎదుట కొత్త షో ఒక‌టి మొద‌లు పెట్టార‌ని తెలుస్తోంది. దీంతో ఆయ‌న వ్య‌తిరేకి గ‌తంలో జ‌గ‌న్ పై పోటీ చేసిన సతీశ్ రెడ్డినే సీన్లోకి  వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇలాంటి వర్గ‌పోరు కార‌ణంగానే టీడీపీ  బ‌లం పెంచుకోలేక క‌డ‌ప గ‌డ‌ప‌లో చ‌తికిల‌ప‌డుతోంది

Read more RELATED
Recommended to you

Latest news