Breaking : ఎల్లుండి అఖిలేశ్ యాదవ్‌తో యాద్రాదికి కేసీఆర్‌..

-

ఈ నెల 18న యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అక్కడ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌తో పాటుగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మరికొందరు జాతీయ నేతలు కూడా యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు గుట్టలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. భద్రతా ఏర్పాట్లను రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ పరిశీలించారు.

స్వామి వారి దర్శనం అనంతరం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగసభకు సీఎం కేసీఆర్ సహా జాతీయ నేతలు వెళ్లనున్నారు. బీఆర్‌ఎస్‌ తొలి సభ కావడంతో సెంటిమెంట్‌గా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మంత్రలు హరీష్, పువ్వాడ అజయ్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news