విద్యాలయాల పున:ప్రారంభంపై మంత్రి సబితా క్లారిటీ.

-

కరోనా కారణంగా తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. సంక్రాంతి సెలవుల అనంతరం నుంచి ఈనెల 30 వరకు విద్యాలయాను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎప్పుడు మళ్లీ ఓపెన్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 5 నుంచి సూళ్లు పున:ప్రారంభం అవుతాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

sabita indra reddy

అన్ని విద్యా సంస్థలకు ఈనెల 30 తో సెలవులు ముగుస్తున్నాయి. దీంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే విద్యా సంస్థల రీఓపెన్ పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సబిత క్లారిటీ ఇచ్చారు. విద్యాసంస్థలను తెరవాలా.. వద్దా అనేది ఈనెల 30 నాటికి ఉన్న కరోనా పరిస్థితులను బట్టి ఉంటుందని ఆమె వెల్లడించారు. ఇప్పటికే 8 ఆపై తరగతులు వారికి ఆన్ లైన్ లో క్లాసులు మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news