ఎడిట్ నోట్: అంతుచిక్కని ‘ప్రజానాడి’.!

-

అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం చూస్తే..ఇంకో 8 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి..అంటే 2023 నవంబర్ నెలాఖరికి గాని, డిసెంబర్ మొదటి వారంలో గాని ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా అధికారంలో ఉన్న కేసీఆర్..ఒకవేళ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తే ఏప్రిల్ లేదా మే నెలలోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.

ఏపీ విషయానికొస్తే..షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏప్రిల్ 2024 ఎన్నికలు జరుగుతాయి. అలా కాకుండా అధికారంలో ఉన్న జగన్ ముందస్తుకు ప్లాన్ చేస్తే 2023 చివరిలోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. సరే ఎన్నికలు ఎటు చూసుకున్న దగ్గరలోనే ఉన్నాయి. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రజానాడి కాస్త అర్ధమవుతుందనే చెప్పాలి..ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత గాని, సానుకూలత గాని వ్యక్తం చేసే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆ పరిస్తితి కనిపించడం లేదు.  అయితే గత ఎన్నికల ముందు కాస్త ప్రజానాడి అర్ధమైంది.

2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికలు జరిగాయి. అప్పుడు అధికారంలో బి‌ఆర్‌ఎస్ పార్టీ ఉంది. ఎన్నికల ముందు కాస్త ప్రజానాడి బి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగానే కనిపించింది. అది దాదాపు అర్ధమైంది. ఇక ఎన్నికల్లో కే‌సి‌ఆర్ స్ట్రాటజీలు, విపక్షాలు ఫెయిల్ అవ్వడంతో..ఈ సారి ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ గెలిచేయొచ్చు అని కొంత అంచనా వేశారు. ఇక ఎన్నికల్లో అదే జరిగింది..బి‌ఆర్‌ఎస్ గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చింది.

అయితే ఇప్పుడు మాత్రం పరిస్తితి అర్ధం కావడం లేదు. ఇప్పుడు తెలంగాణలో గెలుపు కోసం అటు బి‌ఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్, బి‌జే‌పిలు ప్రయత్నిస్తున్నాయి. మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ మూడిటిల్లో ఎవరు గెలిచి అధికారంలోకి వస్తారో ఇప్పుడే అంచనా వేయలేని పరిస్తితి. గతంతో పోలిస్తే ఇప్పుడు సర్వేలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ప్రజలు ఒకరోజు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే..మళ్ళీ ఇంకో రోజు ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల పూర్తిగా ప్రజానాడి పట్టలేని పరిస్తితి.

అటు ఏపీలోనూ అదే పరిస్తితి..అధికారంలో ఉన్న వైసీపీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారా? ప్రతిపక్షంలో టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నారా? జనసేనకు మద్ధతు ఎలా ఉందనేది క్లారిటీ రావడం లేదు. అయితే ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న వారు..తమ అభిప్రాయాలని చెప్పడం లేదు. ఎక్కడ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే..పథకాలు కట్ అవుతాయనే భయం ప్రజల్లో ఉంది. దీంతో వారు ఎవరికి మద్ధతు ఇవ్వాలనే అంశంపై క్లారిటీ ఇవ్వడం లేదు. అంటే ఏపీలో కూడా ప్రజానాడి దొరకడం లేదు. మరి చివరికి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news