వడ్లు కొన‌క‌పోతే.. పుట్ట‌గ‌తులు లేకుండా పోతాడు : కేసీఆర్ పై ఈట‌ల ఫైర్‌

సీఎం కేసీఆర్ మ‌రోసారి ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు. ఇప్పటికైనా చెంపలేసుకొని వడ్లు కొనుగోలు చేయాల‌ని.. లేకపోతే పుట్టగతులు ఉండవని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. 75శాతం ప్రజలు మీ పాలన బాగాలేదు అని సర్వే లో తెలుస్తోందని.. క‌చ్చితంగా కేసీఆర్ కు తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందన్నారు. దేశంలో ఎవరి ఇవ్వని పథకాలు అందిస్తున్న అని ప్రగల్భాలు పలుకుతున్న మన సీఎం గారు… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరని ప్ర‌శ్నించారు.

ఒక చక్రవర్తిలా కేసీఆర్ ఊహించుకొంటున్నాడని.. నాలుగు సంవత్సరాల నుండి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిప‌డ్డారు. ఒకసారి పత్తి అంటాడు ఒకసారి సన్న వడ్లు అంటాడు కానీ రైతులకు లాభం రాలేదన్నారు. సన్న వడ్లు పండించిన వారికి ఐదు పైసలు బిళ్ళ లాభం రాలేదని.. ఇప్పుడు వడ్లు పండించొద్దు అంటాడు దానికి కారణం కేంద్రం అని అంటారని మండిప‌డ్డారు. ఇక్కడ వచ్చిన పంటను మిల్లింగ్ చేసే కెపాసిటీ మన మిల్లులకు లేదని…పేర్కొన్నారు. రోమ్ నగరం తగలపడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టు కేసీఆర్ వ్య‌వ‌హారం ఉంద‌ని ఎద్దేవా చేశారు.